Neetikathamala-1    Chapters    Last Page

సందేశము

''విద్యా దదాతి వినయం'' అను నీ వాక్యము విద్య వినయప్రదాత్రి యని తెల్పుచున్నది. వినయమన కేవలము శిరోనమ్రత మాత్రమే కాదు. మానసికముగ అహంకారమమకా రహిత భావనయే. అట్టి పరిస్థితిని కల్పించుటకు తోడ్పడు విద్యయే విద్య. ఎల్లరకు ప్రయెజకము. ఇట్టి పరిస్థితిని కల్పించు విద్య ఈనాటి పాఠాశాలలలోగాని యింటిలోగా నేర్చుట కవకాశము కన్పట్టుట లేదు. ఆధ్యాత్మిక భావనాసంవర్థకమగు నిట్టి విద్యను మా ఆదేశానుసారము శ్రీ జి.యస్‌.రామశాస్త్రిగారు రచించిన పుస్తకముల ద్వారా విద్యార్థుల మనస్సున కంటునట్లు అధ్యాపకబృందము వివరించి వారి భావి జీవితమునకు తోడ్పడ గలరు.

విద్యాశాఖాధికారి వర్గమువారుకూడా కళాశాలలలో విద్యార్థులకొరకు నీతిబోధనకు నియమితకాలములో ఈగ్రంథమును బాఠ్యముగ బెట్టి విద్యార్థుల నుత్తేజితులుగ నొనర్ప గలరు.

కాంచీపురం

8-5-75 -నారాయణస్మ్రతి

Neetikathamala-1    Chapters    Last Page